Kavitha Son Aditya Participated in Telangana BC Reservation Bandh | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీల బంద్ కు మద్దతుగా ఖైరతాబాద్ చౌరస్తా లో చేపట్టిన మానవహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు కవిత తనయుడు ఆదిత్య సైతం రోడ్డుపై బైఠాయించి ప్లకార్డును ప్రదర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాడుతాం అని ప్లకార్డును ఆయన ప్రదర్శించారు.
బీసీ రిజర్వేషన్ల కోసం ప్రతీ ఒక్కరు బయటకు వచ్చి పోరాడాలన్నారు. మరోవైపు బీసీ బంద్ లో పాల్గొన్న కవిత మాట్లాడుతూ..బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని స్పష్టం చేశారు. కానీ రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించటం నవ్వులాటగా ఉందన్నారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీలు బంద్ కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. బీసీ బిడ్డలను పదే పదే మోసం చేస్తున్నారని కవిత వ్యాఖ్యానించారు.









