Kavitha About Harish Rao News | బీఆరెస్ అధినేత కేసీఆర్ కు తిండి, డబ్బు మీద ధ్యాస ఉండదని కేవలం తెలంగాణ మీదే ధ్యాస ఉంటుందని పేర్కొన్నారు ఆయన తనయ, ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసిన కవిత తాజగా మాజీ మంత్రి హరీష్ రావు, పార్లమెంటు మాజీ సభ్యుడు సంతోష్ రావు పై విరుచుకుపడ్డారు. వీరిద్దరి మూలంగానే కేసీఆర్ కు అవినీతి మరక అంటిందని బాంబు పేల్చారు.
హరీష్ రావు, సంతోష్ అవినీతికి పాల్పడ్డారని వీరిద్దరి మూలంగానే కేసీఆర్ బద్నాం అవుతున్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇందులో మేఘాకృష్ణా రెడ్డి పాత్ర కూడా ఉందన్నారు. హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే రెండవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హరీష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడంలో ఆలస్యం చేశారని కవిత పేర్కొన్నారు.
కేసీఆర్ కు ఏనాడు డబ్బు మీద ధ్యాస లేదని, తన వివాహం చేసేందుకు కూడా ఆయన చాలా ఇబ్బంది పడ్డారని తెలిపారు. దేవుడి లాంటి కేసీఆర్ పై ఈ వయసులో సీబీఐ విచారణకు ఆదేశించడం ఏంటని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా హరీష్, సంతోష్ తనపై చాలా కుట్రలు పన్నారని తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బీఆరెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.









