Sunday 8th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘మోదీ గారు నాకో సూసైడ్ బాంబు ఇవ్వండి పాక్ తో యుద్ధం చేస్తా’

‘మోదీ గారు నాకో సూసైడ్ బాంబు ఇవ్వండి పాక్ తో యుద్ధం చేస్తా’

Karnataka minister offers to become suicide bomber in a war on Pakistan | కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నాయకులు జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతి ఇస్తే తాను పాకిస్థాన్ తో యుద్ధం చేయడానికి సిద్ధమని మంత్రి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘నేను ముస్లింని, కానీ దానికంటే ముందు భారతీయుడ్ని. పాకిస్థాన్ మనకు చిరకాల శత్రువు.

పాక్ తో ఎలాంటి సంబంధాలు లేవు. ఒకవేళ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అనుమతి ఇస్తే పాక్ తో యుద్ధం చేయడానికి నేను సిద్ధం. మోదీ, అమిత్ షా నాకు ఒక సూసైడ్ బాంబు ఇస్తే దాన్ని శరీరానికి చుట్టుకుని పాకిస్థాన్ పై దాడి చేయడానికి కూడా సిద్ధమే.

నేను సరదాగా మాట్లాడడం లేదు, దేవుడి మీద ఒట్టు’ అంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో మంత్రి జమీర్ అహ్మద్ ఈ వ్యాఖ్యలు చేశారు.

You may also like
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
BJP Kishan REddy
సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ!
ssc hall tickes on whatsapp
WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions