Katipally VenkataRamana Reddy| ఒకరు సిట్టింగ్ సీఎం( Sitting Cm ), మరొకరు కాబోయే సీఎం అని ప్రచారం ఈ ఇద్దరి నేతలతో తలపడి చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు కామారెడ్డి ( Kamareddy ) ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ( Katipally Venkataramana Reddy ).
గులాబీ అధిపతి కేసీఆర్ ( KCR ), తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కామారెడ్డి నియోజకవర్గంలో 6,741 ఓట్ల మెజారిటీ తో సంచలన విజయాన్ని నమోదు చేశారు వెంకటరమణ రెడ్డి.
పోటీ చేస్తున్న ఇద్దరు నేతలు నాన్ లోకల్ ( Non-Local ) కావడం, స్థానిక నేత అయిన వెంకటరమణ రెడ్డి పై ఉన్న సానుకూలత తదితర కారణాలతో కామారెడ్డి ప్రజలు ఈ బీజేపీ నేతను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు.
ఈ విజయం తో దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారాయన. అలాగే బీజేపీ( Bjp ) అగ్రనేతలు సైతం వెంకటరమణ రెడ్డిని అభినందిస్తున్నారు.
ఈ చారిత్రాత్మక విజయంతో సోషల్ మీడియా ( Social Media ) ట్రేండింగ్ ( Trending ) అవుతున్నారు, దింతో తెలంగాణలోనే బలమైన ఇద్దరు నేతల్ని ఓడించిన వెంకటరమణరెడ్డి ని ఆడు మోగాడ్రా బుజ్జి అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.










