Kalvakuntla Kavita About Ramcharan | నటుడు రాంచరణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. రాంచరణ్ గొప్ప డాన్సర్ అని కానీ తాను మాత్రం మెగాస్టార్ చిరంజీవి అభిమానిని అని పేర్కొన్నారు. మంగళవారం ఆమె ఎక్స్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు.
‘ఆస్క్ కవిత’ పేరుతో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఓ నెటీజన్ రాంచరణ్ పై కవిత అభిప్రాయం కోరారు. దీనిపై స్పందించిన ఆమె రాంచరణ్ వ్యక్తిగతంగా చాలా వినయంగా ఉండే వ్యక్తి అని అలాగే మంచి డాన్సర్ అని కితాబిచ్చారు. తాను చిరు అభిమాని అని పేర్కొన్న కవిత మెగాస్టార్ కంటే రాంచరణ్ గొప్ప కాదన్నారు. ఇకపోతే 2029 ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.









