KA Paul Comments On Nimisha Priya Case | యెమెన్ దేశంలో కేరళకు చెందిన నర్సు నినిష ప్రియ హత్య కేసులో మరణశిక్ష ఎదురుకుంటున్న విషయం తెల్సిందే.
తాజగా ఆమె కుటుంబం ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ను కలిశారు. నిమిష ప్రియ మరణశిక్ష తాత్కాలిక వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆమె భర్త థామస్, కుమార్తె మిషల్ యెమెన్ కు వెళ్లారు. ఆమెను విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వానికి వారు విజ్ఞప్తులు చేస్తున్నారు.
మరోవైపు కేఏ పాల్ సైతం నిమిష ప్రియ విడుదల కోసం యెమెన్ దేశ నేతలు, మత గురువులను కలుస్తున్నారు. ఈ క్రమంలో నిమిష ప్రియ విడుదల చేయాలని కోరుతూ ఆమె భర్త, కుమార్తెతో కలిసి పాల్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిమిష ప్రియను విడుదల చేయాలని అక్కడి హూతీ ప్రభుత్వాన్ని పాల్ కోరారు. ద్వేషం కంటే ప్రేమ గొప్పదని చెప్పారు. అలాగే అనేక సంవత్సరాలుగా అంతర్యుద్ధం నేపథ్యంలో యెమెన్ లో అశాంతి నెలకొందని శాంతి కోసం మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని పాల్ పేర్కొన్నారు.









