Jr NTR’s Japanese Fan Learns Telugu After Watching RRR | యంగ్ టైగర్ ఎన్టీఆర్ జపాన్ పర్యటన సందర్భంగా ఓ అభిమాని చెప్పిన మాటలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. మార్చి 28న జపాన్ లో ‘దేవర’ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జపాన్ కు వెళ్లారు.
ఈ సందర్భంగా జపాన్ అభిమానులను ఎన్టీఆర్ కలిశారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ లేడీ తాను ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత తెలుగు భాషను నేర్చుకున్నట్లు చెప్పారు. ఇది విన్న ఎన్టీఆర్ ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటన పట్ల ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తానెప్పుడు జపాన్ కు వెళ్లినా మంచి జ్ఞాపకాలు లభిస్తాయని, కానీ ఈ సారి మరింత అద్భుతంగా అనిపించినట్లు పేర్కొన్నారు. ఓ అభిమాని ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన అనంతరం తెలుగు భాష నేర్చుకోవడం తనను కదిలించినట్లు తెలిపారు.
సినీ, బాషా ప్రేమికునిగా..భిన్న సంస్కృతుల మధ్య సినిమా అనే వారధి ద్వారా ఒక అభిమాని తెలుగు భాషను నేర్చుకోవడం తాను ఎప్పటికీ మర్చిపోలేనని ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్ గా అభిమానుల్ని సొంతం చెడుకుంటుందనేందుకు ఇది మరో ఉదాహరణ అని చెప్పారు.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రాం చరణ్ కలిసి నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఇండియాలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అనంతరం ఈ సినిమా జపాన్ లో విడుదల అయ్యింది.