Jr. NTR Apologizes to Telangana Government | యంగ్ టైగర్ ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన ‘వార్-2’ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ క్రమంలో హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. అయితే వేదికపై తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం మర్చిపోయినందుకు క్షమాపణలు కోరారు ఎన్టీఆర్.
హైదరాబాద్ పోలీస్ శాఖ కృషి వల్లే అభిమానులు ఆనందంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిలకించారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం యంగ్ టైగర్ ఒక వీడియోను విడుదల చేశారు.
‘ఈవెంట్ విజయవంతం అవ్వడంలో సహకారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు. అలాగే హైదరాబాద్ పోలీసు శాఖకు ధన్యవాదాలు. మీరు అందించిన సహకారానికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుతున్న. అభిమానులను ఎంతో జాగ్రతగా చూసుకున్నారు. వేదికపై ఈ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయినందుకు క్షమాపణలు. నా 25 ఏళ్ల సినీ జీవితాన్ని అభిమానులతో పంచుకునే ఆనందంలో ఈ తప్పు జరిగింది’ అని ఎన్టీఆర్ వీడియోలో చెప్పారు.









