- తెలంగాణ ఓటింగ్ శాతంపై జనసేనాని అసంతృప్తిై
Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చెసారు. శుక్రవారం మంగళగిరి లోని జనసేన (Janasena) కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ (YSRCP) కులాలను విడగొట్టే పని చేస్తుందని, కానీ జనసేన మాత్రం అన్ని కులాలను కలుపుకొని, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందని తెలిపారు.
యువతే పార్టీకి బలం అని పేర్కొన్నారు జనసేనాని. జనసేన పార్టీకి యువత బలం చూసి బీజేపీ (BJP) పెద్దలే ఆశ్చర్య పోయారని చెప్పారు. అలాగే యువత ఆదరణ చూసే తెలంగాణ లో 8 చోట్ల పోటీ చేసామన్నారు.
దివంగత ముఖ్యమంత్రి కూతురు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల (YS Sharmila) తెలంగాణ లో పోటీకి దూరంగా ఉందని, కానీ జనసేన పార్టీ పోటీ చేసినట్లు గుర్తుచేశారు.
మరోవైపు జగన్ (YS Jagan) చెప్పిన మూడు రాజధానులు అవ్వని పని అని విమర్శించారు.
జనసేన టీడీపీ వెనుకాల నడవడం లేదని, కలిసి నడుస్తుందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.
అలాగే హైదరాబాద్ లో యువత ఓటింగ్ కు దూరంగా ఉండటం బాధించిందని పేర్కొన్నారు జనసేన అధినేత.