Jaipur Accident News | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో టిప్పర్ వచ్చి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో 19 మంది మరణించడం తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ ఘటన జరిగిన రోజే రాజస్థాన్ రాష్ట్రంలో మరో రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
జైపూర్ లోని లోహమండి రోడ్డుపై ఓ డంపర్ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో ట్రక్కును నడుపుతూ వందలాది వాహనాలను ఢీ కొట్టాడు. మొత్తంగా ఐదు కిలో మీటర్ల మేర ఇలా మధ్య మత్తులో డ్రైవింగ్ చేస్తూ బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో భద్రతా, పోలీసు బలగాలు అక్కడి వచ్చి సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు మద్యం మత్తులో అమాయకుల ప్రాణాలు తీసిన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి రోడ్డు టెర్రరిస్టులను తీవ్రంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.









