Isro’s SpaDex Docking | భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ( ISRO ) తాజగా సాధించిన ఘనత పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ( Pm Modi ) హర్షం వ్యక్తం చేశారు.
డిసెంబర్ 30న అంతరిక్షంలోకి వెళ్లిన స్పేడెక్స్-1బి ( SpaDex-1B ), స్పేడెక్స్-1ఏ ( SpaDex-B ) ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా చేపట్టినట్లు ఇస్రో గురువారం ప్రకటించింది. ఈ ప్రక్రియను విజయవంతంగా చేపట్టిన భారత్ అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన నిలిచింది.
ఈ నేపథ్యంలో స్పందించిన ప్రధాని మోదీ..అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక బృందానికి అభినందనలు తెలియజేశారు.
భవిష్యత్ లో ఇస్రో భారత్ చేపట్టబోయే ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలకు ఇది కీలక మెట్టుగా మారుతుందని ప్రధాని కొనియాడారు.