Modi Pawan Conversation | ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా (Delhi New CM) బీజేపీ నేత రేఖా గుప్త (Rekha Gupta) గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీలోని రామ్ లీలా మైదానం జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రిలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
అయితే ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వేదిక మీద ఉన్న అందరికీ నమస్కరిస్తూ వెళ్లిన ప్రధాని మోదీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు రాగానే ఆగి, ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు.
దీక్షలో ఉన్న పవన్ ఆహార్యాన్ని చూసి ప్రధాని మోదీ, పవన్ తో ఆసక్తికర సంభాషణ జరిపారు. హిమాలయాలకు వెళ్తున్నారా పవన్ అని అడిగారు. దీంతో పవన్ సహా వేదికపై ఉన్న నేతలు అంతా చిరునవ్వులు చిందించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.