Injury To Women Constable During KTR Visit | కరీంనగర్ లో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.
అయితే సమావేశానికి వెళ్తున్న సమయంలో కేటీఆర్ కాన్వాయ్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. సమావేశం బందోబస్తుకు వచ్చిన మహిళా కానిస్టేబుల్ పద్మజను బీఆరెస్ కార్యకర్త శ్రీకాంత్ బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ కాలు విరిగింది. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెను చేర్పించారు.
ఈ నేపథ్యంలో కేటీఆర్ పద్మజను పరామర్శించారు. కరీంనగర్ లోని పద్మజ చికిత్స తీసుకుంటున్న ప్రైవేట్ ఆసుపత్రికి కేటీఆర్ చేరుకుని మహిళా కానిస్టేబుల్ ను కలిశారు. చికిత్సకు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని మహిళా కానిస్టేబుల్ కు కేటీఆర్ భరోసానిచ్చారు.