Indiramma Houses Key Rules | తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మొబైల్ యాప్ (Indiramma Houses Mobile App)ను రూపొందించింది.
ఈ యాప్ ను గురువారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లాంఛనంగా ప్రవేశపెట్టారు. ఈ పథకంలో భాగంగా ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం అందించనున్నారు.
కీలక అంశాలు:
ఇందిరమ్మ పథకంలో మొదటి ఏడాది నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున 4 లక్షల 50 వేల ఇండ్లు మంజూరు చేయనున్నారు. లబ్ధిదారులు 400 చదరపు అడుగుల్లోనే ఇంటి నిర్మాణం చేసుకోవాలి. తొలి విడతలో సొంతింటి స్థలం ఉన్న ప్రాధాన్యత ఇస్తారు.
కుటుంబంలో మహిళ పేరుతో ఇల్లు మంజూరు చేయనున్నారు. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు కాగా, ఈ మొత్తాన్ని 4 విడతల్లో నగదు జమ చేస్తారు. మొదటి విడతల లక్షా 20 వేలు, స్లాబ్ పడిన తర్వాత లక్షా 75 వేలు, మిగిలిన మొత్తం మరో రెండు విడతల్లో లబ్ధిదారుల అకౌంట్ల జమ చేయనున్నారు.