IND Vs PAK Champions Trophy 2025 | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడుతుంది.
ఈ క్రమంలో పాకిస్తాన్ పై టీం ఇండియా విజయాన్ని సాధించాలని కోరుకుంటూ అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్ ( Prayagraj ) లో జరుగుతున్న మహా కుంభమేళాలో సైతం భారత్ గెలవాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకోవాలని ప్రత్యేక పూజలు చేసి, గంగా నదికి హారతి ఇచ్చారు. అలాగే కొందరు భక్తులు టీం ఇండియా ( Team India ) ఆటగాళ్ల ఫోటోలకు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయించారు.
కాగా తొలి మ్యాచ్ లో గెలిచి భారత్ జోష్ లో ఉంది, మరోవైపు తొలి మ్యాచ్ లో ఘోర పరభావాన్ని ఎదుర్కొన్న పాక్ భారత్ పై గెలిచి సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకోవలని చూస్తోంది.