HYDRAA team rescues man from getting washed away in Musi Nala | హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్‌పురా రైల్వే స్టేషన్ దగ్గరలోని వరద కాలువలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని హైడ్రా సిబ్బంది బుధవారం కాపాడింది.
మేకల మేతకోసం చెట్టు కొమ్మలను తీసుకువచ్చేందుకు స్థానికంగా నివాసముండే గౌస్ బయటకు వెళ్ళాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వరద కాలువలోకి జారుకున్నాడు. ఆయనను చూసిన వారు వెంటనే 100 మీటర్ల దూరంలో కచ్చామోరీల్లో చెత్తను తొలగించే పనిలో ఉన్న హైడ్రా సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
సిబ్బందికి సమాచారం అందగానే.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించింది. కాలువలోకి దిగడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితుల్లో నిచ్చెన కిందకు వేసి యువకుడిని కాపాడారు.
హైడ్రా ఇన్‌స్పెక్టర్ బాలగోపాల్ హుటాహుటిన సిబ్బందితో అక్కడకు చేరుకుని గౌస్‌ను కాపాడారు. రెయిన్ బజార్ కార్పొరేటర్ వసీతో పాటు..హైడ్రా సిబ్బంది వంశీ, బాలరాజు తదితరులు యువకుడిని కాపాడినవారిలో ఉన్నారు.









