Hyderabad Cp Sajjanar Issues Serious Warning Against Drunk And Driving | డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారికి మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్. మద్యం తాగి వాహనం నడిపితే మూల్యం తప్పదని స్పష్టం చేశారు.
ఈ మేరకు 28 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 4 వరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో 883మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. అలాగే ఇందులో ముగ్గురిని దోషులుగా తేల్చి జైలులు పంపినట్లు వెల్లడించారు. మద్యం తాగి వాహనాలు నడిపి, రోడ్డు ప్రమాదాలకు కారణమై జీవితానికి వెలకట్టలేని జరిమానాను విధించుకోవద్దని ఈ సందర్భంగా సజ్జనర్ సూచించారు.
డ్రంకెన్ డ్రైవ్ చేసిన వారితో పాటు ఎన్నో కుటుంబాలకు తీరని సోకాన్ని మిగుల్చుతుందని పేర్కొన్నారు. బాధ్యత గల పౌరులుగా మద్యం తాగి వాహనం నడపవద్దన్నారు. కాగా ఇటీవలే హైదరాబాద్ సీపీ గా బాధ్యతలు చేపట్టిన సజ్జనర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిని రోడ్డు టెర్రరిస్టులు అని సీరియస్ అయిన విషయం తెల్సిందే.









