Home Minister Anitha Counter To Roja | వైసీపీ ప్రభుత్వం లో వాలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని, 30 వేల మంది మహిళలు మిస్ ( Missing ) అయ్యారని చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధమని మాజీ మంత్రి రోజా తెలిపారు.
ఐదేళ్ళలో 34 కేసులు మహిళల అక్రమ రవాణాకు సంబంధించి నమోదయ్యాయి అని సాక్షాత్తు హోంమంత్రి అనితనే అసెంబ్లీ లో ప్రశ్నకి సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత ( Home Minister Anitha ) స్పందించారు.
‘ విభేదాలు, వ్యక్తిగత, మానసిక కారణాలతో కనపడకుండా పోతే అది మిస్సింగ్. ఉచ్చువేసి క్రయవిక్రయాలు జరిపి కనిపించకుండా మాయం చేసేస్తే అది హ్యుమన్ ట్రాఫికింగ్ ( Human Trafficking ). ఈ రెండింటికి తేడా తెలియకుండానే గత ఐదేళ్లు సీఎంగా జగన్ పరిపాలించారు. మంత్రులుగా రోజా పదవులు అనుభవించారు. అవగాహనరాహిత్యం, అవినీతి తప్ప ప్రజాక్షేమం ఏమాత్రం పట్టని ఇలాంటి వారు పరిపాలించడం ఏపీ ప్రజల పాలిట దౌర్భాగ్యం. వెంటనే తేరుకుని, మేలుకుని అలాంటివారిని ఓటు అనే వజ్రాయుధంతో 11 సీట్లకు పరిమితం చేయడమే వాళ్లు చేసుకున్న అదృష్టం. ‘ అని అనిత ఎద్దేవా చేశారు.