HMPV Cases In India | చైనా దేశంలో గత కొన్నిరోజులుగా ప్రజల్ని వెంటాడుతున్న HMPV వైరస్ క్రమంగా భారత్ లోనూ విస్తరిస్తుంది.
సోమవారం కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో తొలి కేసులు నమోదయ్యాయి. తాజగా మహారాష్ట్ర నాగపూర్ లో ఇద్దరు చిన్నారులకు HMPV వైరస్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.
ఏడు, 14 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు చిన్నారులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏడు కేసులు నమోదయ్యాయి. అయితే HMPV పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ( JP Nadda ) తెలిపారు. ఈ వైరస్ కొత్తది కాదని, 2001 లోనే దీన్ని గుర్తించినట్లు ఆయన చెప్పారు.
ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు వస్తే తక్షణం స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.