Wednesday 28th May 2025
12:07:03 PM
Home > సినిమా > బాలకృష్ణ కెరియర్లోనే అత్యధిక వసూళ్ళు

బాలకృష్ణ కెరియర్లోనే అత్యధిక వసూళ్ళు

Highest grosser in Balakrishna's career

-సంచలన విజయాన్ని అందుకున్న ‘అఖండ’
-సీక్వెల్ ఉంటుందని గతంలోనే చెప్పిన బోయపాటి
-అందుకు సంబంధించి జరుగుతున్న సన్నాహాలు
-మరో వైపున లైన్లోనే ఉన్న బన్నీ ప్రాజెక్టు

బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘అఖండ’ … బాలకృష్ణ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. మాస్ యాక్షన్ ను లింక్ చేస్తూ ఫ్యామిలీ డ్రామాను నడిపించడంలో బోయపాటికి మంచి పేరు ఉంది. వాటికి తోడు ఈ కథలో దైవశక్తిని కూడా యాడ్ చేయడం మరింతగా కలిసొచ్చింది.

ఆ సినిమా తరువాత బోయపాటి చేసిన ‘స్కంద’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అందువలన ఆయన ‘అఖండ 2’కి సంబంధించిన కథను రెడీ చేసుకుంటున్నాడని అంటున్నారు. ‘అఖండ’లోని పాయింటును పట్టుకునే సీక్వెల్ కూడా ముందుకు వెళుతుంది. ఈ విషయాన్ని గతంలోనే బోయపాటి చెప్పాడు.

ఇక ప్రస్తుతం బాలయ్య .. బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తరువాతనే ఆయన బోయపాటి ప్రాజెక్టుపైకి వెళ్లవలసి ఉంటుంది. ‘అఖండ 2’ అనుకున్న సమయానికి మొదలెట్టలేకపోతే, ఆల్రెడీ బన్నీతో ఓకే అనిపించుకున్న కథ రెడీగానే ఉందిగనుక, ఆయనతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో కూడా బోయపాటి ఉన్నాడని అంటున్నారు.

You may also like
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions