Monday 17th March 2025
12:07:03 PM
Home > సినిమా > నాగార్జున సరసన మెరవనున్న ఆషికా రంగనాథ్ ‘నా సామిరంగ’

నాగార్జున సరసన మెరవనున్న ఆషికా రంగనాథ్ ‘నా సామిరంగ’

Aashika Ranganath to star opposite Nagarjuna in 'Na Samiranga'

-గ్రామీణ నేపథ్యంలో సాగే ‘నా సామిరంగ’
-ఆకట్టుకుంటున్న గ్లింప్స్
-సంక్రాంతికి సినిమా రిలీజ్

హైదరాబాద్:
ఆషికా రంగనాథ్ ‘అమిగోస్’ సినిమా సమయంలో ఈ పేరు ఎక్కువగా వినిపించింది. ఎందుకంటే ఈ బ్యూటీ ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కథాకథనాల పరంగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. కానీ గ్లామర్ పరంగా ఆషికా రంగనాథ్ కి మాత్రం మంచి మార్కులు తెచ్చిపెట్టింది. అందువల్లనే ఆమె ‘నా సామిరంగ’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా ఆమె సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమాలో ఆమె పాత్రను పరిచయం చేస్తూ .. ఒక పోస్టర్ ను వదిలారు. ఆమె పాత్రకి సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. వరలక్ష్మి పాత్రలో ఆమె చాలా అందంగా ఆకట్టుకుంటోంది.
ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. అద్దంలో చూసుకుని తన అందానికి తానే మురిసిపోతున్న వరలక్ష్మిని హీరో ముచ్చటగా చూడటం … అతనిని చూసి ఆమె సిగ్గుపడిపోవడం ఈ గ్లింప్స్ లో చూపించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని అందించారు.

You may also like
‘యూట్యూబర్ హర్షసాయి నీకు బుద్ధి ఉందా’
‘ఏయ్ పోలీస్! పాటకు డాన్స్ చెయ్ లేదంటే సస్పెండ్’
‘హిందీ వివాదం..పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన’
హిందీ గో బ్యాక్..పవన్ గత వ్యాఖ్యల్ని గుర్తుచేసిన స్టాలిన్ సోదరి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions