Heavy Flood Water Flow in Musi River | హైదరాబాద్ నగరంలో కొన్నిరోజులుగా భారీ వర్షం కురుస్తోంది. అలాగే వరదలతో జంట జలాశయాల గేట్లు ఎత్తడం, మూసీకి వరద నీటి ప్రవాహం పెరిగింది. ఈ నేపథ్యంలో నగరంలోని మూసి నది ఉగ్రరూపం దాల్చింది.
ఎంజీబిఎస్ వద్ద ప్రమాదకర స్థాయిలో వరద ప్రవహిస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి ఎంజీబిఎస్ బస్టాండ్ లోకి వరద నీరు వస్తోంది. ఈ నేపథ్యంలో బస్టాండ్ ను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే చాదర్ ఘాట్ వద్ద చిన్నవంతెన పై నుంచి వరద ప్రవాహం వెళ్తోంది. మూసారంబాగ్ వద్ద కూడా ఇదే పరిస్తితి నెలకొంది.
దింతో అంబర్పెట్ నుంచి దిల్సుఖ్ నగర్ వైపు వెళ్లే రహదారిని మూసివేశారు. పురానాపూల్ వంతెన వద్ద కూడా మూసికి భారీగా వరద పోటెత్తింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లోని నివాసాలు నీట మునిగాయి.









