Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > AIG ఆసుపత్రికి హరీష్ రావు..వెంట పోలీసులు

AIG ఆసుపత్రికి హరీష్ రావు..వెంట పోలీసులు

Harish Rao Admitted In AIG Hospital | మాజీ మంత్రి, బీఆరెస్ నేత హరీష్ రావు ( Harish Rao ) హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఏఐజీ ఆసుపత్రి ( AIG Hospital )కి శుక్రవారం వెళ్లారు.

గురువారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటివద్దకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో గాంధీపై పోలీసు కేసు నమోదు చేసేందుకు సైబరాబాద్ సీపీ కార్యాలయానికి నేతలతో కలిసి హరీష్ రావు వెళ్లారు.

ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఆయన భుజానికి గాయం అయ్యింది. దింతో ఆయన ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

ఇదిలా ఉండగా హరీష్ రావు ను కొకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దింతో హరీష్ రావు వెంట ఆసుపత్రికి పోలీసులు కూడా వెళ్లారు.

You may also like
‘రేవంత్ బామ్మర్ది బొగ్గు స్కాం..అందుకే కేటీఆర్ కు నోటీసులు’
‘అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని ఉరి తీయాలి’
‘గ్లోబల్ సమ్మిట్..ఈ స్కాంలో నీ వాటా ఎంత రేవంత్’
‘కేసీఆర్ దీక్ష లేకుండా ఆ ప్రకటన లేదు..ఆ ప్రకటన లేకుండా తెలంగాణ లేదు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions