Wednesday 18th March 2026
12:07:03 PM
Home > తాజా > ‘ఇంత డబ్బు పొగరు ఏంట్రా బాబు నీకు’

‘ఇంత డబ్బు పొగరు ఏంట్రా బాబు నీకు’

Gujarat Businessman Blocks Road For Son’s Birthday | గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారవేత్త చేసిన పని ఇప్పుడు తీవ్ర ఆగ్రహావేశాలకు కారణం అవుతుంది. తన కుమారుడి పుట్టినరోజు సంబరాలు చేసేందుకు ఏకంగా బిజీ రోడ్డునే బ్లాక్ చేశాడు ఈ ఘనుడు. ఇతర వాహనదారులు అవస్థలు పడుతున్నా అవేమీ పట్టించుకోకుండా రోడ్డుపై వాహనాలను ఆపేసి టపాసులు కాల్చాడు. ఇదేంటని ప్రశ్నించబోయున ఓ వ్యక్తిని ఏకంగా బెదిరించాడు. అంతేకాదు తాను ఎలాంటి నేరం చేయలేదని కొద్దీ నిమిషాల పాటు వాహనాలను ఆపేస్తే ఏమవుతుందని దాబాయించాడు కూడా.

ఈ ఘటన పట్ల నెటిజన్లు భగ్గుమంటున్నారు. గుజరాత్ సూరత్ కు చెందిన దీపక్ ఇజార్దార్ ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్. డిసెంబర్ 21న తన కుమారుడి 19వ పుట్టినరోజు సందర్భంగా ఈయన రోడ్డుపై హల్చల్ చేశాడు. డుమస్ అనే ప్రాంతంలో బిజీగా ఉండే రోడ్డును తన ప్రైవేట్ ఎస్టేట్ గా భావించాడు. వాహనాలను ఆపేసి టపాసులు కాల్చాడు. వాహనదారులు హారన్స్ కొడుతున్నా పట్టించుకోలేదు. అంతేకాదు వెనకాల ఓ కారు నుండి హారన్ శబ్దం విని భారీ టపాసులను కారు మీద వదలబోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలో అయినప్పటికీ తాను ఓ సెలబ్రెటీ అని, ఐదు నిమిషాలు వాహనాలు ఆపడం నేరమా అని తిరిగి ప్రశ్నించాడు. ప్రత్యర్ధులు కావాలనే తనపై కక్ష కట్టి వీడియోను వైరల్ చేశారని పేర్కొనడం గమనార్హం. అనంతరం రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే బెయిల్ పై తర్వాత విడుదల అయ్యాడు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions