Group Photo Sessions Of MLA’s And MLC’s | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గ్రూప్ ఫోటో సెషన్ నిర్వహించారు.
అలాగే సాయంత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. గ్రూప్ ఫోటో సెషన్ లో భాగంగా మొదటి వరుసలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు మరియు మంత్రులు కూర్చున్నారు.
సీనియారిటీ ప్రకారం ఎమ్మెల్యేలు తర్వాత వరుసలో కూర్చున్నారు. ఎమ్మెల్యేల గ్రూప్ ఫోటో సెషన్ తర్వాత ఎమ్మెల్సీలు గ్రూప్ ఫోటో దిగారు. మొదటి వరుసలో సీఎం, డిప్యూటీ సీఎం మండలి ఛైర్మన్ మరియు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూర్చుని గ్రూప్ ఫోటో దిగారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ను బొత్స సత్యనారాయణ పలకరించారు. బాగున్నారా అంటూ ఇరువురు పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు.