Monday 6th April 2026
12:07:03 PM
Home > తాజా > ‘పోలీస్ మామలు’ వాట్సప్ గ్రూప్..అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ఎస్ఐ!

‘పోలీస్ మామలు’ వాట్సప్ గ్రూప్..అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ఎస్ఐ!

police mamalu group

Police Mamalu WhatsApp Group | పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఒక వింత మరియు ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకోవడానికి కొందరు ‘అతి తెలివి’తో క్రియేట్ చేసిన వాట్సప్ గ్రూప్‌లోకి ఏకంగా ఎస్ఐ ఎంట్రీ ఇచ్చి అందరినీ అవాక్కయ్యేలా చేశారు.

నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడెక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు, తనిఖీలు ఎక్కడ జరుగుతున్నాయి అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకోవడానికి కొందరు మందుబాబులు ‘పోలీసు మామలు’ అనే పేరుతో ఒక వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేశారు.

పోలీసుల కళ్లు గప్పి తప్పించుకోవడమే లక్ష్యంగా నడుస్తున్న ఈ గ్రూప్ వ్యవహారం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది.

అయితే, ఇటీవల పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ఒక వ్యక్తి ఫోన్‌ను పరిశీలించగా ఈ ‘పోలీసు మామలు’ గ్రూప్ గుట్టు రట్టయింది.

ఇది చూసి షాక్ అయిన ట్రాఫిక్ ఎస్ఐ, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ గ్రూపులోకి స్వయంగా ప్రవేశించారు. అనంతరం ఒక వీడియోను పోస్ట్ చేస్తూ.. “అందరి నంబర్లు సేవ్ చేసుకున్నాను, త్వరలోనే మీ అందరికీ స్పెషల్ కౌన్సిలింగ్ ఉంటుంది” అంటూ అదిరిపోయే ‘స్వీట్ వార్నింగ్’ ఇచ్చారు.

ఎస్ఐ వీడియో చూడగానే గ్రూప్ అడ్మిన్‌తో సహా సభ్యులందరూ భయంతో గజగజలాడుతూ గ్రూప్ నుండి ఎగ్జిట్ అవ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో మరియు వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions