First phase of Gram Panchayat elections in Telangana | పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం తొలిదశ పోలింగ్ ప్రారంభం అయ్యింది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. తొలి దశలో భాగంగా 4,236 సర్పంచ్ పదవులకు, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో 396 సర్పంచ్, 9,663 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మరికొన్ని చోట్ల వివిధ కారణాలతో పోలింగ్ జరగడం లేదు.
ఇవిపోగా గురువారం 3,834 సర్పంచ్ స్థానాలకు, 27, 628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ తో పాటు ఇతర చోట్ల ఉపాధి నిమిత్తం నివాసం ఉంటున్న గ్రామస్థులు పల్లెలకు తరలివస్తున్నారు. పలు చోట్ల స్వల్ప ఘర్షణలు మినహా ప్రస్తుతానికి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది.









