Feroz Khan On Owaisi | తెలంగాణ ( Telangana ) అసెంబ్లీ ( Assembly ) సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మరియు అక్బరుద్దిన్ ఒవైసి ల మధ్య మాటల యుద్ధం జరిగింది.
అసెంబ్లీ లో ముస్లిం ల గొంతు నొక్కి ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని అక్బరుద్దీన్ ( Akbaruddin ) వ్యాఖ్యానించగా, అక్బరుద్దీన్ ని ఒక ముస్లిం నేతగా చూడట్లేదని, కేవలం ఎంఐఎం ( AIMIM ) నేతగానే చూస్తాం అని తెలిపారు రేవంత్ రెడ్డి ( Revanth Reddy ).
అలాగే గత బీఆరెస్ ( Brs ) పాలనను కీర్తిస్తూ మాట్లాడితే వినడానికి తాము సిద్ధంగా లేమని అక్బరుద్దీన్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం. కాగా అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ( Feroz Khan ).
అక్బరుద్దీన్ మరియు ఆయన పార్టీ ముస్లిం ( Muslims ) ల పేరు చెప్పుకుని వ్యాపారాలు మాత్రమే చేస్తున్నారని ఆరోపించారు. 10 ఏండ్ల బీఆరెస్ పాలనలో ఒవైసి ( Owaisi ) ఎప్పుడు కూడా మైనారిటీ సమస్యలపై కేసీఆర్ ( Kcr ) ను ప్రశ్నించలేదన్నారు.
ఇక ఎంఐఎం సమయం ముగిసి పోయిందని, ఇప్పుడు ఓల్డ్ సిటీ ( Old City ) అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటుందని స్పష్టం చేశారు ఫిరోజ్ ఖాన్.