Sandip Ghosh News | కోల్కత్త ( Kolkata ) లోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ( R G Kar Medical College )లో గత నెల 9న జూనియర్ వైద్యురాలి పై జరిగిన హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న కాలేజి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ( Sandip Ghosh ) ను సీబీఐ అరెస్ట్ చేసిన విషయము తెల్సిందే. అయితే సందీప్ ఘోష్ కు సంబంధించిన ఓ వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది.
2017లో ముర్శిదాబాద్ మెడికల్ కాలేజీలో చీఫ్ ఫిజీషియన్ గా సందీప్ ఘోష్ పనిచేశారు. ఈ సమయంలో హాంకాంగ్ ( Hong Kong )లోని క్వీన్ ఎలిజిబెత్ హాస్పిటల్ (Queen Elizabeth Hospital ) లో నిర్వహించిన అటాచ్మెంట్ ప్రోగ్రాం ( Attachment Program )లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హాంకాంగ్ కు చెందిన ఓ పురుష నర్సింగ్ విద్యార్థి ( Male Nursing Student )ని సందీప్ ఘోష్ లైంగికంగా వేదించిన కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ కేసుపై హాంకాంగ్ లో కోర్టు విచారణ సైతం ఎదుర్కొన్నారు.
అయితే నిర్దోషిగా సందీప్ ఘోష్ నిర్దోషిగా విడుదల అయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.