Eluru Police Handed Over Stolen Gold and Silver Ornaments to 23 Victims | ఏలూరు జిల్లా పోలీసుల మూలంగా 23 కుటుంబాల్లో సంక్రాంతి పండుగ వెలుగులు కనిపించాయి.
ఏలూరు జిల్లా పలు పోలీసు స్టేషన్ల పరిధిలోని దొంగలు రెచ్చిపోయారు. పండుగ ముందు ఇంట్లోకి చొరబడి డబ్బులను, బంగారు ఆభరణాలను మరియు ఇతర విలువైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు.
ఈ క్రమంలో 23 మంది పోలీసులను ఆశ్రయించారు. దింతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరిపి దొంగల్ని పట్టుకున్నారు. అలాగే నిందితుల నుండి 2 కిలోల 206 గ్రాముల బంగారం, 9.40 కిలోల వెండి, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు.
కేసులని పరిష్కరించి రికవరీ చేసిన బంగారాన్ని ఫిర్యాదుదారులకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ( SP Prathap Shiva Kishore ) అందజేశారు. ఈ సందర్భంగా పండగకి ముందు పోగొట్టుకున్న బంగారం, వెండి, నగదు తిరిగి పొందడంతో మా ఇంట్లో పండగ వెలుగులు కనిపిస్తున్నాయని ఫిర్యాదుదారులు సంతోషం వ్యక్తం చేశారు.