elephants killed in passenger train collision | ఈశాన్య రాష్ట్రం అయిన అస్సాంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఏనుగుల మందను రైలు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఎనమిది ఏనుగులు మృతి చెందగా మరో ఏనుగు తీవ్రంగా గాయపడింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి గాయాలు అవ్వలేదని అధికారులు వెల్లడించారు. ఏనుగుల మందను రైలు ఢీ కొట్టడంతో ఇంజిన్ తో సహా ఐదు బోగీలు పట్టాలు తప్పాయి.
రాజధాని ఎక్స్ప్రెస్ సైరాంగ్ నుండి ఢిల్లీకి బయలుదేరింది. ఈ క్రమంలో హోజాయ్ జిల్లాలోని జమునాముఖ్-కాంపూర్ సెక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టాలపై ఉన్న ఏనుగుల మందను రైలు ఢీ కొట్టింది. దింతో ఎనమిది ఏనుగులు మృతి చెందగా, మరికొన్ని తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఏనుగుల మందను చూడాగానే లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేశారని, అయినప్పటికీ ప్రమాదం జరిగిందని నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే అధికారులు మీడియాకు చెప్పారు. ప్రమాదం జరిగిన ప్రాంతం ఎలిఫెంట్ కారిడార్ కాదని పేర్కొన్నారు. ఇకపోతే ప్రయాణికులను ఇతర బోగీల్లో సర్దుబాటు చేసి రైలు గౌహతికి బయలుదేరింది.









