EC Announces Election Schedule | దేశంలో మరోసారి ఎన్నికల (Elections) నగరా మోగింది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశంలో జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీల ఎన్నికల తేదీలను ప్రకటించారు.
జమ్మూ కశ్మీర్‌లో 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18న తొలి విడత, సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత ఎన్నికలు నిర్వహిస్తారు. 90 శాసనసభ నియోజకవర్గాలున్న హరియాణాలో అక్టోబర్ 1న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు.
అక్టోబర్ 4న రెండు రాష్ట్రాల ఫలితాలు విడుదల చేస్తారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. చివరిసారిగా 2014లో అక్కడ ఎన్నికలు జరిగాయి. సెప్టెంబర్ 30లో జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలనే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈసీ ఈ షెడ్యూల్ ప్రకటించింది.