Drunken Drive Cases In Hyd | నూతన సంవత్సరం (New Year) వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న రాత్రి డ్రైంకెన్ డ్రైవ్ (Drunken Drive) చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించిన విషయం తెలిసిందే.
అయినప్పటికీ కొంతమంది మందుబాబులు పోలీసుల వార్నింగ్ ని పెడ చెవిన పెట్టారు. దీంతో డ్రంకెన్ డ్రైవ్ టెస్టుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా భారీగా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా సైబరాబాద్ పరిధిలో చాలా కేసులు నమోదయ్యాయి.
ప్రతి పీఎస్ పరిధిలో ఐదు చెక్ పాయింట్స్ పెట్టి తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో మధ్య తాగి వాహనాలు నడిపిన 1239 మంది పై కేసులు నమోదు అయ్యాయి. 938 టూ వీలర్స్, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500లకు పైగా, రాచకొండ పరిధిలో 517 కేసులను నమోదు చేశారు పోలీసులు. మియాపూర్ సర్కిల్ లో ఎక్కువగా 253 కేసులు నమోదయ్యాయి.
తర్వా త కూకట్ పల్లిలో ఎక్కు వగా డ్రం క్ అం డ్ డ్రైవ్ కేసులు నమోదయ్యా యి. 25 ఏళ్ల నుంచి 35 వయసు ఉన్న వాళ్లపై అత్య ధికం గా 536 కేసులు ఫైల్ చేశారు పోలీసులు.