Donald Trump News | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) భారతదేశాన్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించిన విషయం తెల్సిందే.
ఆయన పర్యటన ముగిసిన అనంతరం ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ ( DOGE ) భారత్ కు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
భారత్ లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అమెరికా అందిస్తున్న 21 మిలియన్ డాలర్ల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయానికి సంబంధించిన ఫైళ్లపై డోనాల్డ్ ట్రంప్ మంగళవారం సంతకం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..భారత్ కు డబ్బులెందుకివ్వాలి, వల్ల దగ్గరే చాలా ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించారు. అమెరికా పై భారత్ అధిక పన్నులు వేస్తోందని మరోసారి కామెంట్స్ చేశారు.