Donald Trump forgets name of Japanese PM | అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు, తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల చుట్టూ తీవ్ర చర్చ నడుస్తోంది.
ఇదే సమయంలో ఆయన చేస్తున్న మరికొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మీమ్స్ కు దారి తీస్తున్నాయి. తాజగా ట్రంప్ జపాన్ ప్రధానమంత్రి పేరు మర్చిపోయారు. పేరు మర్చిపోయిన నేపథ్యంలో ఆయన్ను మిస్టర్ జపాన్ గా ట్రంప్ సంభోదించారు.
జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబా (Shigeru Ishiba) పేరును డొనాల్డ్ ట్రంప్ మర్చిపోయి, ఆయనను “మిస్టర్ జపాన్” అని సంబోధించిన ఘటన ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా చోటుచేసుకుంది. ఈ సంఘటన సామాజిక మాధ్యమాలు, విస్తృతంగా చర్చనీయాంశమైంది.
ఇంటర్వ్యూలో, ట్రంప్ జపాన్‌తో వాణిజ్య ఒప్పందాలు, ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడుతూ, ప్రధానమంత్రి షిగెరు ఇషిబా పేరును గుర్తు చేసుకోలేక “మిస్టర్ జపాన్” అని పేర్కొన్నారు.
అయితే ట్రంప్ జపాన్ ప్రధాని పేరును మర్చిపోవడం అవమానకరంగా భావిస్తున్నట్లు జపాన్ దేశ నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ట్రంప్ కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.