Director Maruthi Emotional Speech at The Raja Saab – Pre Release | రెబల్ స్టార్ ప్రభాస్ ను చూసి, సినిమా కోసం ఆయన పడిన శ్రమను గుర్తుచేసుకుని ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు దర్శకుడు మారుతి. ప్రభాస్, మారుతీ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘ది రాజాసాబ్’. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లో శనివారం రాత్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతీ మాట్లాడుతూ..తన లాంటి మీడియం రేంజ్ దర్శకుడిని కూడా రెబల్ యూనివర్సిటీలో చేర్చుకుని ఈ స్థాయిలో నిలబెట్టారని భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సినిమా కోసం ప్రభాస్ జీవితాన్ని పెట్టేశారు అని పేర్కొన్నారు. ప్రభాస్ కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపిన ఆయన..రెబల్ స్టార్ ను చూస్తూ ‘మీరు ఎదురుగా ఉంటే నా వల్ల కాదు సర్’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వెంటనే ప్రభాస్ వేధికపైకి వెళ్లి ఓదార్చారు. ఇకపోతే అభిమానులను రాజాసాబ్ సినిమా ఒక్క శాతం కూడా నిరాశ పరచదని అలా జరిగితే తన ఇంటికి వచ్చి అడగాలన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని తన ఇంటి అడ్రెస్ ను కూడా ఇచ్చారు.








