Dire Wolves Howl Again After 12,000 Years | వేల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైర్ తోడేళ్ళకు (Dire Wolf) విజ్ఞాన శాస్త్రజ్ఞులు తిరిగి జీవం పోశారు.
జన్యు సాంకేతికత (జెనెటిక్ టెక్నాలజీ) సహాయంతో క్లోనింగ్ పద్ధతి ద్వారా ఈ పురాతన జంతువును పునర్జన్మింపజేసినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. అమెరికా డల్లాస్ లోని కోలోస్సల్ బయోసైన్సెస్ అనే కంపనీ ఈ ప్రయోగాన్ని చేసింది.
రెండు ఆరు నెలల మగ తోడేళ్ళు, ఒక మూడు నెలల ఆడ తోడేలుకు జీవం పోసినట్లు కంపనీ పేర్కొంది.
డైర్ తోడేళ్ళు, సుమారు 12500 సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికా ప్రాంతంలో సంచరించిన ఒక భారీ ఓనాయి జాతి.
ఇది పరిమాణంలో పెద్దదిగా, బలమైన దవడలు మరియు పదునైన పళ్లతో ఉంటుందనే అంచనా. పురాతన కాలంలో ఈ జంతువు అంతరించిపోయినప్పటికీ, దాని శిలాజాల నుండి సేకరించిన డీఎన్ఏను ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తల బృందం, “ఇది కేవలం ఒక జంతువును తిరిగి తీసుకురావడం మాత్రమే కాదు, పాత కాలం పర్యావరణ వ్యవస్థలను అర్థం చేసుకోవడంలో కూడా ఒక ముఖ్యమైన ముందడుగు” అని తెలిపింది. ప్రస్తుతం ఈ డైర్ వోల్ఫ్‌ను ప్రయోగశాలలో పెంచుతున్నారు మరియు దాని ప్రవర్తన, ఆరోగ్యాన్ని శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో మరిన్ని అంతరించిన జాతులను తిరిగి తీసుకురావడానికి మార్గం సుగమం కానుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇవి కేవలం డైర్ తోడేళ్లను పోలినవి మాత్రమేనని, అంతేకాని ఇవే డైర్ తోడేళ్ళు కావని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రముఖ హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ త్రోన్స్’ లో డైర్ తోడేళ్లను టెక్నాలజీ సహాయంతో క్రియేట్ చేశారు. దింతో అప్పటి నుండి డైర్ తోడేళ్లపై ఆసక్తి నెలకొంది. ఇదిలావుండగా ప్రస్తుతం జీవం పోసిన మూడు డైర్ తోడేళ్లను రహస్య ప్రాంతంలో కంపనీ ఉంచింది.