Dil Raju About Actor Vijay | టాలీవుడ్ నిర్మాత దిల్ రాజ్ కోలీవుడ్ అగ్ర నటుడు, తలపతి విజయ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
విజయ్ యొక్క క్రమశిక్షణ, పనితీరు, మరియు షూటింగ్ డేట్స్ విషయంలో అతని పక్కా ప్రణాళికను దిల్ రాజు కొనియాడారు. విజయ్ నెలకు 15-20 రోజుల డేట్స్ ముందుగానే ఇవ్వడం వల్ల నిర్మాతలకు ఖర్చు తగ్గుతుందని, ప్రీ-ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం దొరుకుతుందని, దీనివల్ల సినిమా షూటింగ్ త్వరగా పూర్తవుతుందని ఆయన అన్నారు.
ఈ విధానం టాలీవుడ్‌లో ప్రస్తుతం లేకపోవడం పట్ల దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ మంచి పద్ధతిని తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. విజయ్‌ను “నిర్మాతల హీరో”గా అభివర్ణించిన దిల్ రాజు, ఇతర హీరోలు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తే నిర్మాతలకు ఎంతో మేలని పేర్కొన్నారు. విజయ్, దిల్ రాజ్ కాంబినేషన్ లో వారసుడు సినిమా 2023లో విడుదల అయిన విషయం తెల్సిందే.










