IPL 2024 Playoffs | ఐపీఎల్ 2024 (IPL 2024) లీగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ (KKR), సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మరియు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB) ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి.
ఇందులో భాగంగా మంగళవారం కోల్కత్త, హైదరాబాద్ టీం లు అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫైర్ 1 (IPL Qualifier-1) ఆడనున్నాయి. అలాగే రాజస్థాన్, బెంగళూరు ఎలిమినేటర్ ఆడనున్నాయి. ఇదిలా ఉండగా ప్లే ఆఫ్స్ కు చేరుకున్న నాలుగు టీం లలో ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది.
అదే లెటర్ R. కోల్కత్త పేరులో రైడర్స్ అని, హైదరాబాద్ టీం లో రైజర్స్ అని, రాజస్థాన్ రాయల్స్ లో డబుల్ ఆర్ అని, బెంగళూరు లో రాయల్ లో ఆర్ అని ఇలా ప్రతి టీం లో R కామన్ గా ఉంది. ఇకపోతే ఈ R కు తోడు వర్షం రూపంలో రైయిన్ అనే మరో ‘ R ‘ ఐపీఎల్ ఫ్యాన్స్ ను భయపెడుతోంది.









