Friday 11th July 2025
12:07:03 PM
Home > తాజా > ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి!

ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి!

adluri laxman kumar

Adluri Laxman Kumar | తెలంగాణలో కేబినెట్ విస్తరణ (Telangana Cabinet Expansion) లో భాగంగా కొత్తగా ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆ ముగ్గురిలో ధర్మపురి (Dharmapuri MLA) శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే అడ్లూరి లక్షణ్ కుమార్ (Adluri Laxman Kumar) కూడా ఉన్నారు.

ఎస్సీ మాదిగ సామాజిక వర్గకోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కింది. ఆదివారం రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా లక్ష్మణ్ కుమార్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా, ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2009-2011 మధ్య ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఆ తర్వాత ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. తాజాగా.. మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవితో జాక్‌పాట్ కొట్టేశారు.

You may also like
‘కల్తీ కల్లు ఘటన..రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి’
‘నారా లోకేశ్-మాధవ్ భేటీ..తెలంగాణ అస్థిత్వంపై దాడి’
‘సకాలంలో యూరియాను సరఫరా చేయండి’
bandi sanjay comments
పేదలకు ఒక న్యాయం.. అక్బరుద్దీన్ కుఒక న్యాయమా: బండి సంజయ్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions