Dharmapuri Arvind News| నిజామాబాద్ ( Nizamabad ) ఎంపీ, బీజేపీ ( BJP ) నేత ధర్మపురి అర్వింద్ ( Dharmapuri Arvind )ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం నాడు మీడియా ( Media )తో మాట్లాడారు ఆయన.
అసెంబ్లీ ( Assembly ) ఎన్నికల్లో బీఆరెస్ ఓటమితో ఆ పార్టీ శకం ముగిసిందని, ఇక నుండి కాంగ్రెస్ ( Congress ) మరియు బీజేపీ ల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని అభిప్రాయ పడ్డారు. బీఆరెస్ ( BRS ) పతనం మొదలైందని, అందుకు తాను సంతోషంగా ఉన్నట్లు తెలిపారు ఈ బీజేపీ నేత.
అలాగే బీఆరెస్, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారని, అంతేకాకుండా లిక్కర్ కేసు ( Liquor Case )లో కవిత ఎపిసోడ్ కూడా కాంగ్రెస్ కు దోహద పడిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హుందాతనంతో కూడిన రాజకీయాలు తిరిగి వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. నేతల బాషా కూడా మారుతుందన్నారు.
బలమైన అభ్యర్థి లేని చోట తాను వెళ్లి పోటీ చేసానని, ఒక్క రూపాయి కూడా పెట్టకుండా పోటీ చేసానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) చాలా కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తి అంటూ కితాబిచ్చారు.