Deputy Cm Pawan Kalyan News | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. గుంటూరు జిల్లా నంబూరు లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పారిశుద్ధ్య తరలింపు వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కృష్ణా వరదల్లో ప్రజలకు సాయపడ్డ పారిశుధ్య కార్మికులను ప్రత్యేకంగా సన్మానించారు.
సాధారణంగా చెత్త దరిదాపుల్లోకి వెళ్ళడానికే ఆలోచిస్తారు,అలాంటిది చెత్తని తొలగించి, పరిసరాలు పరిశుభ్రం చేసే పారిశుధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాను ఆలోచన చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
పారిశుధ్య కార్మికులకు గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు కూడా కూటమి ప్రభుత్వంలో చెల్లించడం జరిగిందని కొంత జీతాలు పెంచాలి అనే అభ్యర్థన తన దృష్టికి వచ్చిందని, దీనిని కచ్చితంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.