Deputy CM Pawan Frustrates on Fans | అన్నమయ్య జిల్లా (Annamaiah District) గాలివీడు ఎంపీడీవో (Galiveedu MPDO Jawahar Babu) జవహర్ బాబుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కడప రిమ్స్ (Kadapa RIMS) చికిత్స పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించి దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాడికి పాల్పడిన వారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు.
ఈ క్రమంలో పవన్ చూసేందుకు అక్కడికి వచ్చిన పలువురు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్ సీరియస్ గా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ‘ఓజీ.. ఓజీ.. ఓ అంటూ స్లోగన్లు చేశారు.
దీంతో డిప్యూటీ సీఎం ఫ్యాన్స్ పై అసహనం వ్యక్తం చేశారు. “ఏంటయ్యా మీరు. ఎప్పుడు స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కకు రండి” అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు.