David Warner begins Robinhood promotions | ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హైదరాబాద్ చేరుకున్నారు.
ఆదివారం జరగనున్న రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఆయన పాల్గొననున్నారు. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుమల తెరకెక్కించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ రాబిన్ హుడ్. ఇందులో డేవిడ్ వార్నర్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ కు డేవిడ్ వార్నర్ స్పెషల్ గెస్ట్ గా హాజరవుతారు. ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయనకు మూవీ టీం స్వాగతం పలికింది. కాగా రాబిన్ హుడ్ మూవీలో డేవిడ్ పాత్రలో వార్నర్ కనిపించనున్నారు. గతంలో టాలీవుడ్ మూవీలకు సంబంధించిన పాటలకు స్టెప్పులేస్తూ సోషల్ మీడియా వార్నర్ రీల్స్ చేయగా అవి తెగ వైరల్ గా మారిన విషయం తెల్సిందే.