Cooking Gas LPG Price Hiked By Rs.50 Per Cylinder For All Users | కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సోమవారం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్ పై రూ.2 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే ఎక్సైజ్ డ్యూటీ పెరిగినా ప్రజలపై ఎలాంటి భారం పడదని కేంద్రం భరోసా ఇచ్చింది. ఇదిలా ఉండగా వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధరలు రూ. 50 పెంచతున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటన చేశారు.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా అందే సిలిండర్ పై కూడా పెంచిన రూ.50 వర్తించనుంది. ఈ కొత్త ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.