Thursday 21st November 2024
12:07:03 PM
Home > తెలంగాణ > షర్మిలను కలవరిస్తున్న కాంగ్రెస్.. వైఎస్ఆర్టీపీ విజయం సాధించినట్టే!

షర్మిలను కలవరిస్తున్న కాంగ్రెస్.. వైఎస్ఆర్టీపీ విజయం సాధించినట్టే!

ys sharmila

YS Sharmila | వైఎస్ షర్మిల.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు కలువరిస్తున్న పేరు. ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లుగా.. తెలంగాణ మెట్టినిల్లుగా చెప్పుకుంటూ రెండు రాష్ట్రాల ఆడబిడ్డగా రాజకీయాల్లో ఉన్నారు.

ప్రస్తుతం ఏపీలో తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) ముఖ్యమంత్రి కావడం వెనక పరోక్షంగా షర్మిల కూడా కారణం అనడంలో సందేహం అక్కర్లేదు.

అక్రమాస్తుల ఆరోపణలతో జగన్ జైల్లో ఉండగా కాలికి బలపం కట్టుకొని మరీ రెండు తెలుగు రాష్ట్రాల్లో జగనన్న వదిలన బాణాన్ని అంటూ ప్రజల్లో తిరిగారు.

జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతిని అలాగే కొనసాగడంలో తన వంతు పాత్ర పోషించారు.

2019 లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత జగన్ సీఎం అయ్యారు. ఆ తర్వాత వైఎస్ (YSR) కుటుంబంలో ఆస్తుల గొడవలు, పదవుల తగాదాలు అంటూ మీడియాలో ఏవేవో వార్తలు వినిపించాయి.

అనంతరం షర్మిల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) నుంచి బయటకి వచ్చారు.

నిజంగా జగన్ తో విభేదాలు ఏర్పడ్డాయని మీడియాలో వచ్చిన కథనాలు వాస్తవమే అయితే ఆయనకు వ్యతిరేకంగా షర్మిల ఏపీ రాజకీయాలమీదే ఫోకస్ చేయాలి.

మరి దానికి కూడా కారణాలేంటో తెలీదు కానీ, అనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారామె. లోటస్ పాండ్ వేదికగా ఏకంగా రాజకీయ పార్టీని స్థాపించి, సంచలనానికి తెరతీశారు.

తెలంగాణలో కూడా తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై (YS Rajasekhar Reddy) ఉన్న సానుభూతిని సానుకూలంగా మార్చుకోవడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని నామకరణం చేశారు.

Read Also: Congress మైండ్ గేమ్ పాలిటిక్స్.. మాణిక్ రావు ఠాక్రేకు రాములమ్మ కౌంటర్!

కేవలం ఏపీ వరకే పరిమితం ..

రాష్ట్ర విభజన తర్వాత 2019 వరకు అసలు తెలంగాణ రాజకీయాలతో వైఎస్ షర్మిలకు (YS Sharmila) సంబంధమే లేదనే విషయం ఇరు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఆమె కేవలం ఏపీ వరకే పరిమితం అయ్యారు.

అయితే కుటుంబంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో తాను తెలంగాణ బిడ్డననీ, ఇక్కడి కోడలిని అని చెప్పుకొంటూ రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టారు.

వైఎస్సార్ టీపీ అధినేతగా తెలంగాణ సమస్యలపై ‘తనదైన శైలి’ లో పోరాడుతున్నారు.

కనీసం గుర్తించలేదు..

వైఎస్ షర్మిల పార్టీ స్థాపించనప్పుడు రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ పెద్దగా సీరియస్ గా పరిగణనలోకి తీసుకోలేదు. అసలు ఆమె పార్టీని కనీసం గుర్తించను కూడా లేదు.

ఏదో తెలంగాణ రాజకీయాల్లో ఆటలో అరటిపండు మాదిరిగా భావించారు. ఏ పార్టీ నుంచి పెద్దగా నేతలు కూడా షర్మిల పార్టీలో చేరలేదు. తెలంగాణ ప్రజలు కూడా షర్మిల పార్టీపై అనేక సెటైర్లు వేశారు.

కీలకంగా మారిన షర్మిల..

కానీ నేడు అసెంబ్లీ ఎన్నికల ముందు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో షర్మిల కీలకంగా మారారు.

ఆమె పార్టీవల్ల ఒరిగే ప్రయోజనాలు పెద్దగా లేకపోయినా, రెండు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు షర్మిల పేరును కలవరిస్తున్నారు. కాంగ్రెస్ పట్ల షర్మిల అనుసరిస్తున్న వైఖరికూడా దానికి ఒక కారణం.

కర్ణాటక లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆ విజయంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ని (DK Siva Kumar)ని షర్మిల కలిశారు. అప్పటి నుండి వైఎస్ఆర్టీపీ, కాంగ్రెస్ పొత్తుపై పలు మార్లు వార్తలు వచ్చాయి.

అంతే కాకుండా కాంగ్రెస్ నాయకులు తనకి ఫోన్ చేస్తున్నారని కానీ తానే జవాబు ఇవ్వట్లేదు అని షర్మిల పేర్కొన్నారు.

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా షర్మిలతో ఫోన్ లో మాట్లాడారనే విషయం కూడా బయటకి వచ్చింది.

Also Read: అమిత్ షా-కేటీఆర్ భేటీ.. బీజేపీ-బీఆరెస్ బంధానికి దారితీస్తుందా!

డీకే శివ కుమార్ తో రాయబారాలు..

తాజాగా డీకే శివకుమార్ ని కలిసిన టీ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అక్కడ కూడా షర్మిల ప్రస్తావన తెచ్చారు. అయితే ఆ పార్టీతో పొత్తు కాకుండా విలీనం గురించి చర్చించినట్లు వార్తలు వచ్చాయి.

మరోవైపు ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా షర్మిల పార్టీపై ఆసక్తికనబరుస్తున్న సూచనలు ఉన్నాయి.

పైగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే కూడా షర్మిల అవసరం తెలంగాణలో కంటే ఏపీలో ఎక్కువగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆమె చేరిక లేదా పొత్తు విషయం అధిష్టానం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు.

మరోవైపు ఏపీలో ఆ పార్టీ సీనియర్ నేతలు తులసి రెడ్డి, గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ వైఎస్ కూతురిగా షర్మిల తమ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామన్నారు.

తద్వారా కాంగ్రెస్ పార్టీకి షర్మిల అవసరం ఉందని పరోక్షంగాచెబుతున్నారు.

ఒకవేళ నిజంగా షర్మిల ఏపీ కాంగ్రెస్ తో జత కడితే తన అన్న వైఎస్ జగన్ విజయావకాశాలకు కాస్త గండి పడినట్లే అని భావించవచ్చు.

అసలే బీజేపీ టీడీపీ జనసేన కూటమి ఏర్పడితే తన ఓటమి తప్పదని కంగారు పడుతున్న తరుణంలో చెల్లెలి రూపంలో మరో ప్రత్యర్థి వస్తే మాత్రం జగన్ విజయావకాశాలపై నీలినీడలు కమ్మినట్టే!

Read Also: బీజేపీ పెద్దలతో కేటీఆర్ భేటీ.. ఢిల్లీ నుంచి ఈటల, కోమటిరెడ్డికి పిలుపు!

మొత్తానికి 2019 ఎన్నికల తర్వాత కొన్నాళ్లు అనామకంగా, రాజకీయాలకు దూరంగా ఉన్న షర్మిల ఈ కొద్ది రోజుల్లోనే రాజకీయంగా విజయం సాధించింది.

ఇన్నాళ్లు తన పార్టీని కూరలో కరివేపాకులా తీసిపారేసిన నేతలు తనతో పొత్తుకోసం వెంపర్లాడేలా అనుకున్నది సాధించారు.

ఎన్నికల పోరులో ఎలా ఉన్న తెలంగాణ రాజకీయాల్లో మాత్రం వైఎస్ఆర్టీపీ విజయం సాధించినట్లే!

కానీ, షర్మిలతో జత కట్టే అవకాశాలను వెంపర్లాడుతున్న టీకాంగ్రెస్ కు ఆమె చేరికతో లాభం కంటే నష్టమే ఎక్కువ అని బోధపడటం లేదా!

You may also like
నన్ను కాపాడండి..ప్రాణాలు పోతున్నాయన్నా చలించని మనుషులు
అఖండ భారతంలో అదానీకో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా
అదానీకి అరెస్ట్ వారెంట్.. ఛార్జిషీట్ లో మోదీ పేరు చేర్చాలి
వలలో చిక్కిన చిరుత..వండుకుని తినేసిన వేటగాళ్ళు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions