మిర్యాలగూడ:తెలంగాణ నూతన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని మంగళవారం డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కేసి వేణు గోపాల్ రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసిన వెంటనే వారు ఆయనకు శాలువాలు కప్పి, పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాలో కష్టపడి అన్ని స్థానాలు కైవసం చేసుకున్నందుకు శంకర్ నాయక్ తోపాటు నాయకులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ నాయకు లునూకల వేణుగోపాల్ రెడ్డి, గుండు నరేందర్ గౌడ్, శంకర్ రెడ్డి వున్నారు…









