Saturday 31st January 2026
12:07:03 PM
Home > క్రీడలు > రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలికామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ!

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలికామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన బీజేపీ!

rohit sharma

Body Shaming On Rohit Sharma | భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై కాంగ్రెస్ పార్టీ (Congrss Party) నాయకురాలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మను కించపరిచేలా బాడీ షేమింగ్ కు పాల్పడ్డారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి శమా మహమ్మద్ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. “క్రీడాకారుడిగా రోహిత్ శర్మ ఫిట్ గా లేడు. అతడు బరువు తగ్గాలి. అంతేకాదు.. గత కెప్టెన్లతో పోలిస్తే అత్యంత ఆకట్టుకోని కెప్టెన్ ఇతడే” అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ ట్వీట్ పై  బీజేపీ (BJP) అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందిస్తూ కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చారు. “ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటు..! భారత క్రికెట్ కెప్టెన్ ను కూడా వారు వదలడం లేదు. రాజకీయాల్లో విఫలమైన వారి నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పుడు క్రికెట్ ఆడాలని వారు కోరుకుంటున్నారేమో..!” అని ఎద్దేవా చేశారు.

మరో నేత షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. “రాహుల్ గాంధీ కెప్టెన్సీలో వారు 90 ఎన్నికల్లో ఓడిపోయారు. దిల్లీలో డకౌట్ అయ్యారు. టీ20 ప్రపంచకప్ తెచ్చిన వ్యక్తి కంటే.. ఇదే వారికి ఆకట్టుకునే అంశమేమో..? భారతీయ సంస్థలు, మన సాయుధ దళాలను వ్యతిరేకించే ఆ పార్టీ ఇప్పుడు క్రీడాకారులపైనా విమర్శలు గుప్పిస్తోంది. వారివి ప్రేమ దుకాణాలు కాదు.. విద్వేష కేంద్రాలు” అని మండిపడ్డారు.

You may also like
నితీష్ హ్యాట్రిక్..ఆర్సీబీ కెప్టెన్ డకౌట్
అభిషేక్ శర్మ అంటే పాకిస్థానీలకు పిచ్చి..ఎంతలా వెతికారంటే!
SRH నుంచి బయటకు..క్లారిటీ ఇచ్చిన నితీశ్
kohli retirement
రెడ్ బాల్ గేమ్ కు గుడ్ బై.. కొహ్లీ ఎమోషనల్ పోస్ట్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions