Cm Revanth Strong Warning To Tollywood Celebs | టాలీవుడ్ ఇండస్ట్రీ ( Tollywood Industry )కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు.
తాను ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నంతవరకు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు వంటివి ఉండవన్నారు. అనుమతి లేకున్నా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చారన్నారు.
ఎంఐఎం ( MIM ) ఎమ్మెల్యే సంధ్య థియేటర్ తొక్కిసలాట కు సంబంధించి అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు. తొక్కిసలాటలో మహిళ మృతి చెందిందని తెలిసినా అల్లు అర్జున్ కారు రూఫ్ టాప్ ( Rooftop ) పైకి ఎక్కి చేతులు ఊపుకుంటూ వెళ్లారని మండిపడ్డారు.
ఇక్కడ సమస్య అవుతుందని ఏసీపీ చెప్పినా నటుడు పట్టించుకోలేదన్నారు. అలాగే ఒకరోజు జైల్లో ఉండి వస్తే అల్లు అర్జున్ కలిసేందుకు సినీ ప్రముఖులు తరలివచ్చారని, కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడ్ని చూసేందుకు మాత్రం ఎవరూ వెళ్లలేదని ఆగ్రహించారు.
సినీ ప్రముఖులు వ్యాపారం చేసుకోవచ్చు కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతామంటే మాత్రం ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు.