Cm Revanth Reddy News Latest | తాను ప్రధాని మోదీ ( Pm Modi )ని వ్యక్తిగతంగా దూషించలేదని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
శనివారం సీఎం ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi )తో భేటీ అయ్యారు. సుమారు గంటసేపు జరిగిన ఈ భేటీలో కులగణన, ఎస్సి వర్గీకరణ అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మోదీ పుట్టుకతో బీసీ ( BC ) కాదు అని మాత్రమే తాను అన్నట్లు, మోదీని వ్యక్తిగతంగా తిట్టలేదని సీఎం పేర్కొన్నారు. ప్రధాని పై గౌరవం ఉందన్నారు.
తన మాటలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ( Kishan Reddy ), బండి సంజయ్ ( Bandi Sanjay ) వక్రీకరించారని విమర్శించారు. పుట్టుకతో మోదీ బీసీ కాదు కాబట్టే ఆయనకు బీసీల పట్ల చిత్త శుద్ధి లేదన్నారు. చిత్త శుద్దే ఉంటే జనగనణలో భాగంగా కుల గణన కూడా చేయాలని డిమాండ్ చేశారు.